KMR: అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీజేపీ బిచ్కుంద మండల అధ్యక్షుడు శెట్పల్లి విష్ణును సోమవారం ఉదయం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అవినీతి, అరాచక, కమిషన్ల పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెళ్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడం తగదన్నారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.