MBNR: మిడ్జిల్ మండలం వల్లభురావుపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ జ్యోతి ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేరుస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ మహేశ్, పంచాయతీ కార్యదర్శి సుదర్శన్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.