KNR: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నాయకులను కరీంనగర్ రూరల్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ చర్యపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్య గొంతును నొక్కలేరని విమర్శించారు.