తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించి, గ్రామ సభల ద్వారా సైబర్ మోసాలు, నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టారు. “డిజిటల్ అరెస్ట్” వంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్‌కు స్పందించకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.