KMR: జిల్లా మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వర్ పల్లిలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురవగా ఈ సమయంలో పడిన పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ఎర్రగొల్ల లింబాద్రికి చెందిన సుమారు లక్షన్నర విలువచేసే రెండు పాడి గేదెలను గ్రామంలోని చింత చెట్టు కింద కట్టివేయగా చెట్టుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాయి.