W.G: పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్లు డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కాళ్ల మండలం పెదఅమీరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వారితో పాటు పలువురికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.