WG: ఉమ్మడి ప.గో. జిల్లాలో సోమవారం నుంచి 4 రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలతో పాటు జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా గరిష్ఠంగా 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.