పాక్ హ్యాండ్లర్లకు భారత వైమానిక దళానికి(IAF) చెందిన అత్యంత సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్నాడనే ఆరోపణలతో సుమిత్ అనే ఉద్యోగిని అధికారులు అరెస్ట్ చేశారు. అసోం చబువా ఎయిర్ఫోర్స్ స్టేషన్లో MTSగా చేస్తున్న అతను.. 2023 నుంచి పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో టచ్లో ఉంటూ సైనిక రహస్యాలను విక్రయించినట్లుగా విచారణలో తేలింది. దీంతో OSC 1923 కింద కేసు ఫైల్ చేశారు.