సూపర్-8 గ్రూప్-2 మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ 51 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 146 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 95 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో షనక (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్స్ 3 వికెట్లు తీయగా.. ఆర్చర్, డాసన్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లతో లంక పతనాన్ని శాసించారు.