హైదరాబాద్ NGRI, IISER శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులపై కీలక పరిశోధనలు చేపట్టారు. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ను భూగర్భంలో నిల్వ చేసే విధానంపై వివరించారు. సౌరాష్ట్ర, భోపాల్, ముంబై-పుణె-నాసిక్ కారిడార్ ప్రాంతాలు ఇందుకు అనుకూలమని గుర్తించారు. నిల్వ చేసిన CO₂ కొద్ది కాలంలోనే కార్బోనేట్ రాళ్లుగా మారుతుందన్నారు.