వికారాబాద్ జిల్లా రైతుల ఖాతాల్లోకి ఇవాళ రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. తొలి విడతలో ఒక ఎకరా లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. రెండు, మూడు దశల్లో మిగిలిన రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది. జిల్లాలో మొత్తం 3,27,561 మంది రైతులకు గాను, 6,45,166 ఎకరాలకు ఈ సాయం వర్తించనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 387 కోట్లకుపైగా నిధులను విడుదల చేసింది.