SRD: పటాన్ చెరులో శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 నుంచి 29 వరకు జరగనున్నాయి. ఆదివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 27న సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.