NZB: ముప్కాల్ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులకు ఆదివారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సురేశ్, ఆర్మూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ కిరణ్ పాల్, వీడీసీ అధ్యక్షుడు కట్ట మహేష్ యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలతో భవన నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.