MNCL: మంచిర్యాల పట్టణంలో రైల్వే స్టేషన్ నుండి శ్రీనివాస్ థియేటర్ వరకు రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో రాష్ట్రంలోనే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌ను మొదటి స్థానంలో నిలపడమే తన లక్ష్యం అన్నారు. ఇందుకు సహకరిస్తున్న వివిధ శాఖల అధికారులకు కృతజ్ఞత తెలిపారు.