BDK: భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా గ్యాస్ కొరత తీవ్రంగా ఉన్నదని తక్షణమే ప్రభుత్వం & ఉన్నతాధికారులు శ్రద్ధ తీసుకొని ప్రజలకు సరిపడా గ్యాస్‌ని అందించాలని బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గం అసెంబ్లీ అధ్యక్షులు కొండా చరణ్ ఇవాళ తెలిపారు. ఒకపక్క గ్యాస్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం గ్యాస్ కొరత లేదు అని చెప్పడం సరికాదన్నారు.