BDK: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సుమారు 8 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఏప్రిల్ నెలలోనే మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి ఖమ్మంలోని రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ చర్యలు చేపట్టారు.