NLG: చిట్యాల మున్సిపాలిటీలో వేసవి ముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా 2, 8, 9 వార్డుల్లో సరఫరా సరిగ్గా లేక ప్రజలు అల్లాడుతున్నారు. పైప్లైన్లు జామ్ కావడంతో నీటి ఒత్తిడి తగ్గి సరఫరా మందగించింది. దీంతో కౌన్సిలర్లు ట్యాంకర్ల ద్వారా ప్రతి ఇంటికీ డ్రమ్ము చొప్పున నీటిని అందిస్తున్నారు. అధికారులు స్పందించి పైప్లైన్ మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.