CTR: తవణంపల్లి మండలంలోని కృష్ణాపురంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ నిన్న ఘనంగా ముగిసింది. పలువురు క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు. మొదటి బహుమతి శ్రీరంగంపల్లి జట్టు, రెండవ బహుమతి కృష్ణాపురం జట్టు, మూడవ బహుమతి పెద్ద పంజాని జట్టు సాధించాయి. విజేతలకు అతిథులు బహుమతులు అందజేసి అభినందించారు. క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.