TG: ములుగు జిల్లా మండపేటలోని రాజుపేట-లక్ష్మీ నర్సాపూర్‌లో 2026 మార్చి 3 నుంచి 7 వరకు జరిగే శ్రీ నాగులమ్మ మహాజాతరకు ప్రభుత్వ సహకారం ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. మంత్రి సీతక్కను కలిసిన ఆలయ అధికారులు కలిసి.. నాగదేవత జాతరకు రావాలంటూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు.