బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ‘కింగ్’ మూవీ పనుల్లో ఉండగానే, బ్లాక్ బస్టర్ ‘జవాన్’ సీక్వెల్‌కు రంగం సిద్ధమైనట్లు టాక్. దర్శకుడు అట్లీ ఇప్పటికే ‘జవాన్ 2’ స్క్రిప్ట్‌ను ఫైనల్ చేయగా, ఈ ఏడాది చివరలోనే మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సీక్వెల్లో విలన్ పాత్ర కోసం సౌత్ ఇండియన్ టాప్ స్టార్‌ను ఎంపిక చేసే యోచనలో మేకర్స్ ఉన్నారట.