అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో మున్సిపల్, డివిజన్, మండల స్థాయిలో పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. స్వయంగా రాలేని వారు meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా తమ అర్జీలను పంపించాలని సూచించారు.