మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం(Malkajigiri Constituency)లో ప్రభుత్వ పథకాలన్నింటీని తెలంగాణ ప్రభుత్వం తాత్కలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఏదో ఒక సాకు చెప్పి గవర్నమెంట్ స్కీమ్(Government Scheme) లని ఆపాలని అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mainampally Hanmantha Rao) ఎపిసోడ్ ఇంకా కొలిక్కి రాకపోవడంతోనే ప్రభుత్వ పథకాలన్నింటినీ బ్రేక్ చేసింది. బీసీ బంధు, మైనారిటీ బంధు, కళ్యాణ లక్ష్మి(Kalyana Lakshmi) ,షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ బంద్ అయినట్లు వార్తాలు వస్తోన్నాయి. దళిత బంధు రెండో విడుత దరఖాస్తుల సేకరణ పూర్తిగా బంద్ రద్దు అయింది.
మెదక్ అసెంబ్లీ (Medak Assembly) సీటును తన కుమారుడు రోహిత్‌కు కేటాయించకపోవడంతో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంత్రి హరీష్ రావు(Minister Harish Rao)ను టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్ చేసిన విషయం తెలిసిందే. హరీష్ రావుపై అంతటి ఘాటైన వ్యాఖ్యలు చేసినా.. మైనంపల్లికి మల్కాజిగిరి సీటును గులాబీ బాస్ కేటాయించారు. అయితే మైనంపల్లి మాత్రం తన కొడుక్కి టికెట్ ఇవ్వకుంటే మెదక్ తో సహా మల్కాజిగిరిలలో రెండు చోట్ల ఇండిపెండెంట్‌గా అభ్యర్థులుగా పోటీ చేసి, తమ సత్తా చూపిస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్ (BRS) అధిష్టానం మైనంపల్లికి పొమ్మన లేక పొగ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆయనపై నేరుగా చర్యలు తీసుకోకుండానే..పార్టీని విడిచి వెళ్లిపోయేలా వ్యుహాం పన్నుతున్నట్లు సమాచారం. ముందుగా మైనంపల్లి ఆదేశాలను అధికారులు వినకుండా చేయాలని, ఆ తర్వాత కార్పొరేటర్లు, కీలక నేతలను దూరం చేయాలని స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఏది ఏమైనా మైనంపల్లి (Mainampally) ఎపిసోడ్ వల్ల మల్కాజిగిరిలో సంక్షేమ, అభివృద్ది పథకాలకు బ్రెక్ పడడం గమనార్హం.