మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, JC శ్రీనివాసులుకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. చిన్నారులు భరతనాట్యంతో ఎంతగానో అలరించారు. పండితుడు మధుసూదన్ శాస్త్రి ఉగాది పంచాంగం వినిపించారు.