TPT: తిరుపతి బస్టాండ్లో బుధవారం భారీగా ప్రయాణికుల రద్దీ కనిపించింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగియడం, ఉగాది, రంజాన్ పండగలకు వరుస సెలవులు రావడంతో విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో బస్సుల్లో సీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది.