»Horoscope Today In Telugu September 1st 2023 Telugu
Horoscope today: నేటి రాశి ఫలాలు(September 1st 2023)..లక్ష్మీ దేవి అనుగ్రహం!
నేడు (01 September 2023 ) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అంశాలు సహా అనేక జ్యోతిష్య విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
horoscope: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రోజు చంద్రుడు మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఏ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు వృత్తి రంగాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. సంపూర్ణ సంకల్పం సిద్ధిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. మీ ఇష్టదైవాన్ని పూజించడం మరువవద్దు.
వృషభ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ఉదయం నుంచే శుభవార్తలు వింటారు. దీని వల్ల మీ మనసుకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. మరోవైపు కొన్ని విషయాల్లో మీరు కొంత ఒత్తిడికి గురవుతారు. వ్యాపారులు కొంచెం తెలివిగా వ్యవహరించడం మంచిది. స్నేహితుల సహాయంతో కొన్ని మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారులు అనుభవం ఉన్న వారి నుంచి సలహాలు తీసుకుంటే మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారు నేడు కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి నేడు జీవిత భాగస్వామితో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించబడుతాయి. మీ జీవిత భాగస్వామితో విహారయాత్రకు వెళతారు. మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేసినట్లయితే, కొంచెం ఎక్కువ కష్టపడటం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు. ఈరోజు సాయంత్రం, స్నేహితులకు సహాయం చేసేందుకు కొంత డబ్బును ఏర్పాటు చేసుకోవచ్చు.
సింహ రాశి
ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా కష్టపడి, నిజాయితీగా చేస్తే మంచి లాభాలు తప్పకుండా లభిస్తాయి. మీరు ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, దాన్ని కొంత కాలం వాయిదా వేయండి. లేదంటే అది మీకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. ఈరోజు మీ కుటుంబంలో ఎవరితోనైనా వాదనలు ఉండొచ్చు. సహనం వహించడం మంచిది.
కన్య రాశి
కన్య రాశి వారికి ఈరోజు ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు మీ జీవితం కొత్త దిశలో మలుపు తిరుగుతుంది. మీరు ఈరోజు రుణాన్ని సులభంగా పొందుతారు. మీరు విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఈరోజు మీరు భవిష్యత్తులో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తుల రాశి
ఈ రాశి వారు ఈరోజు శుభవార్త వినొచ్చు. కొంచెం పరధ్యానంలో ఉంటారు. స్నేహితుడి సహాయంతో దీర్ఘకాలిక పనులు పూర్తి అవుతాయి. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీ పిల్లల నుంచి కొన్ని సంతోషకరమైన వార్తలను వింటారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు కోల్పోయిన వస్తువులను తిరిగి లభించే అవకాశం ఉంది. దీంతో మీ ఆనందానికి అవధులనేవే ఉండవు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ పని చేసినా గౌరవం లభిస్తుంది. మీరు కొత్త ప్రాజెక్టు కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామి కోపంగా ఉండొచ్చు. వారిని ప్రశాంతంగా ఒప్పించే ప్రయత్నాలు చేయాలి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారు రాజకీయ రంగంలో గొప్ప విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని రంగాల్లో పూర్తి మద్దతు, సాంగత్యాన్ని పొందొచ్చు. ఈరోజు మీరు అనుభవం ఉన్న వ్యక్తుల నుంచి ప్రయోజనం పొందుతారు. ఈరోజు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు.
మకర రాశి
ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో చిన్న గొడవలు పెద్దగా మారే అవకాశం ఉంది. మీ మనసులో కొంచెం కలత చెందుతారు. మీరు త్వరగా దాన్ని అధిగమించొచ్చు. మీ కుటుంబ సభ్యులు ఈరోజు కొన్ని కారణాల వల్ల ఆందోళన చెందుతారు. ఈ కారణంగా మీరు గందరగోళంగా ఫీలవుతారు. మీ కుటుంబంలోని ఒక సభ్యుని అనారోగ్యం కారణంగా మీరు వారి చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఈరోజు మీరు మీ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కొంత డబ్బు ఖర్చు చేస్తారు.
కుంభ రాశి
ఈరోజు ఉపాధి కోసం పని చేసే వ్యక్తులు నేడు మీకు గొప్ప విజయాన్ని అందిస్తాయి. విద్యార్థులు ఈరోజు విద్యా రంగంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. లేదంటే చదువులో విజయం సాధించడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఈరోజు మీరు కొంత ఆస్తిని పొందొచ్చు. ఈ కారణంగా మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి చిన్న పార్టీని నిర్వహించొచ్చు.
మీన రాశి
మీన రాశి వారిలో వ్యాపారులు ఏదైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, మంచి విజయం సాధిస్తారు. మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఈరోజు మీరు స్నేహితులతో బయటకు వెళ్తారు. ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేసే వారికి సహోద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది. మీరు ఏ పని చేయమని ఎవరిపైనా ఒత్తిడి చేయకూడదు. మీ తల్లికి ఆరోగ్యం కుదుట పడుతుంది.