NLG: చిట్యాల మండలం ఎలికట్టె నుంచి వెంబావి వరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ, సర్పంచ్ సాగర్ల యాదమ్మ యాదయ్యలు సోమవారం ఈ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం కృషితో గ్రామీణ రవాణా మెరుగుపడి రైతులకు, ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరుతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మండలి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.