NDL: సిరివెళ్ల మండల వజ్రాల ఎర్ర వంక వాగు నుంచి గ్రావెల్ మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం గాజుల పల్లె పరిధిలో నంద్యాల-గిద్దలూరు రహదారిపై ఈ టిప్పర్ల రాకపోకల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని స్థానికులు తెలిపారు.ఈ పరిస్థితిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.