యూపీ మంత్రి ధరంపాల్ సింగ్ (Dharampal Singh) కారులో లక్నో రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లి కలకలం సృష్టించారు. తనకి ఆలస్యం కావడంతో రైలును అందుకునేందుకు మంత్రి తన కారులో పైకి వచ్చారు. ఈ సంఘటనను కొందరు వీడయో తీయడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణ ప్రజలకు వర్తించే నియమాలు కొన్ని సందర్భాల్లో కొందరికి మాత్రం వర్తించవు. అధికారం పేరుతో యథేచ్ఛగా వ్యవహరించిన సన్నివేశాలు చూసే ఉంటాం.ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోనూ ఓ మంత్రి ఇలాంటి నిర్వాకానికే పాల్పడ్డారు. ఏకంగా తన కారును రైల్వే ప్లాట్‌ఫాం (Platform)పైకి తెచ్చేశారు.
ఆయన పేరు ధరమ్‌పాల్‌సింగ్. పాడిపరిశ్రమల శాఖ మంత్రి లక్నో(Lucknow) నుంచి రాయబరేలి వెళ్లేందుకు మంత్రి హౌరా-అమృత్సర్ ఎక్కాల్సి ఉంది.అయితే.. రైల్వే స్టేషన్ దాకా కారులో వచ్చిన మంత్రి.. లోపలి దాకా నడవటం ఎందుకు అనుకున్నారేమో.. ఏకంగా తన కారును ప్లాట్‌ఫాంపైకి తీసుకుపోవాలని కారు డ్రైవర్‌ను ఆదేశించారు.దీంతో వీల్చైర్లు నడిచేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ర్యాంపు పైకి ఎక్కిన కారు.. నేరుగా చార్బాగ్ రైల్వేస్టేషన్ (Railway station) ప్లాట్‌ఫాం4పైకి రావడంతో అక్కడున్న జనం తెల్లబోయారు.
రైలు లేట్ అవడంతో ఇలా రావాల్సి వచ్చిందని ఆయన అనుచరులు చెబుతున్నా.. ఆయనకు నడవడం ఇష్టం లేకే కారులో రైలు దాకా వచ్చారని అక్కడున్నవారు చర్చించుకున్నారు. ఇక్కడ ఈ విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దేశంలో రైల్వే ప్లాట్‌ఫామ్‌పై కారు నడపడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. అయితే మీరు వీటికి దూరంగా ఉండాలి. రైల్వే ట్రాక్‌లకు ఆనుకుని రద్దీగా ఉండే ప్లాట్‌ఫారమ్‌లపై కార్ల (Cars) వంటి వాహనాలను నడపడం ప్రయాణికులకు సురక్షితం కాదు.. అంతేకాకుండా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.