KDP: రాజంపేటలోని హెచ్పీ గ్యాస్ గోడౌన్ను సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన పరిశీలించారు. గ్యాస్ సరఫరా, నిల్వ పరిస్థితులు, భద్రతా చర్యలను సమీక్షించారు.హెచ్పీ గ్యాస్ కార్యాలయంలోకి వెళ్లి రికార్డులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో తహసీల్దార్ పీర్ మున్ని పాల్గొన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా కొనసాగించాలని అధికారులకు సూచించారు.