SRCL: సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ‘షీ టీం’ ఏఎస్సై ప్రమీల అన్నారు. చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సూచనల మేరకు జిల్లా షీ టీమ్ మహిళలు పని చేసే ప్రదేశాలను సందర్శిస్తూ గుడ్ టచ్-బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో చట్టం, షీ టీమ్ సేవలు, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు.