ATP: శింగనమల మండలం పెద్దమట్లగొంది గ్రామంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో MLA బండారు శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగు కష్టాలను అడిగి తెలుసుకున్న ఆమె, కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.