ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనె స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సీజన్లో రోహిత్ శర్మ సరికొత్త వెర్షన్లో కనిపిస్తున్నాడని జయవర్ధనె చెప్పాడు. గతంలో కంటే ఫిట్‌గా, పూర్తి అంకితభావంతో ఉన్నాడని కొనియాడాడు. రోహిత్ జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపాడు.