PDPL: సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలో సర్పంచ్ ఉప్పు లక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సంప్రదాయ బోనాలతో ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించారు. గ్రామ పెద్దలు పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.