ప్రకాశం: గుడ్లూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో గంజాయి అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. చెన్నైకు చెందిన సాయికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు 19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం అనంతరం గంజాయి సంచులను దాచిపెట్టి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.