E.G: రాజమండ్రి నగర కమిషనర్ రాహుల్ మీనాను రూడా ఛైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దివాన్ చెరువులో పలు అభివృద్ధి పనులు కోసం కమిషనర్‌తో చర్చించారు. స్థానిక ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దివాన్ చెరువు గ్రామస్తులు పాల్గొన్నారు.