ఏపీలోని ప్రకాశం జిల్లా (Prakasam District) కురిచేడు ఎమ్మార్వో ఆఫీసులోకి వేలాది గొర్రెలను తొలి నిరసన దిగారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.పాలకులకు తోలు మందం అయితే..గొర్రెల మేతకు కుడా కష్టం వస్తుందని ఆయన పెర్కోన్నారు.దర్శి నియోజకవర్గం కురుచేడు మండలం గొర్ల పాలెంలో అదే జరిగింది. గొర్రెలు మేతకు వెళ్లే కొండ పోరంబోకు భూమి ఆక్రమణకు గురి కావడంతో తహసీల్దార్ కార్యాలయంలోకి వేల గొర్రెల (Sheep) ను తోలి కాపరులు నిరసనకు దిగాల్సి వచ్చింది. ఈ దున్నపోతు ప్రభుత్వం అలసత్వం వీడి గొర్రెల పెంపకం దారుల సమస్యను వెంటనే పరిష్కరించాలి ” అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
కాగా, సమస్యలను పరిష్కారించాలని తహసీల్దార్ కార్యాలయం (Office of Tehsildar) చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోకపోవడంతో గొర్రెల కాపర్లు దాదాపు పదివేల గొర్రెలను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి నిరసన తెలిపారు. అధికారులు ఇప్పటికైనా నిద్ర లేవాలని వారు డిమాండ్ చేశారు.గొర్రెల కాపరులు (Shepherds) పలుమార్లు ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ను ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో వారు విసిగివేశారారు. సోమవారం 3వేల గొర్రెలను కురిచేడు ప్రధాన కూడలికి తీసుకొచ్చి ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి గొర్రెలను లోపలికి తోలారు. దీంతో కార్యాలయం మొత్తం గొర్రెలతో నిండిపోయింది. తహసీల్దార్‌తో వారు వాగ్వివాదానికి దిగగా ఆయన నచ్చజెప్పారు. త్వరలో దారిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కాపరులు గొర్రెలను అసైన్డ్ పట్టాలు (Assigned tracks) పొందిన వారి పొలాల్లోకి తోలుకెళ్లి నిరసన చేపట్టారు.
పాలకులకు తోలు మందం అయితే…గొర్రెల మేతకు కూడా కష్టం వస్తుంది. దర్శి నియోజకవర్గం కురుచేడు మండలం గొర్ల పాలెంలో అదే జరిగింది. గొర్రెలు మేతకు వెళ్ళే కొండ పోరంబోకు భూమి ఆక్రమణకు గురి కావడంతో తహశీల్దార్ కార్యాలయంలోకి వేల గొర్రెలను తోలి కాపరులు నిరసనకు దిగాల్సి వచ్చింది. ఈ దున్నపోతు… pic.twitter.com/ALjbQHvuNb