HYD: మియాపూర్ పరిధిలో లీ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు బోల్తా పడింది. కూకట్పల్లి నుంచి 10 మంది ఉద్యోగులతో గడ్డపోతారం వెళ్తుండగా, బాచుపల్లి సమీపంలోని మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న పలువురు ఉద్యోగులకు స్వల్ప గాయాలవ్వగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.