»A Cow Attacked Nine Year Girl Who Was Going To School At Chennai Viral Video
Viral video: దారుణం..స్కూల్ కు వెళ్తున్న బాలికపై ఆవు దాడి
ఆవులను చాలా పవిత్రమయిన జంతువులుగా భావిస్తాం. కానీ ఈ వీడియోలో మాత్రం ఓ చిన్నారిపై దాడి చేసిన ఆవును చూస్తుంటే చాలా క్రూరంగా కనిపిస్తుంది. అయితే స్కూల్ కు వెళ్తున్న చిన్నారిపై దాడి చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
స్కూల్ కు వెళ్తున్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రయణించే ఆ మార్గాల్లో ఏదైనా వాహానాలు ఎదురుగా రావడం లేదా ఇతర జంతువులు, శునకాలు, ఆవులు, గేదెలు వస్తుంటాయి. అలాంటి క్రమంలో చిన్నారులను జాగ్రత్తగా తీసుకెళ్లాలి. లేదంటే అవి అనుకోకుండా వచ్చి చిన్నారులు లేదా పేరెంట్స్ పై దాడి చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పటికే ఇటివల హైదరాబాద్లోని ఓ కాలనీలో స్కూల్ కు వెళ్తున్న చిన్నారిని.. వేగంగా వచ్చి ఓ ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. దీంతో ఆ చిన్నారి గాయాలపాలైంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ఘోర ఘటన తమిళనాడు చెన్నైలో చోటుచేసుకుంది. తన తల్లితో కలిసి ఓ చిన్నారి(9) పాఠశాలకు వెళ్తుండగా ఓ ఆవు బాలికపై దాడి చేసింది. కొమ్ములతో బాలికను విసిరికొట్టింది. ఆ క్రమంలో గమనించిన పలువురు ఆవును కొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆవు వెనక్కి వెళుతూ మళ్లీ ముందుకొచ్చి బాలికపై దాడి చేసింది. చివరకు మరికొంత మంది జోక్యం చేసుకుని ఆవును తరిమికొట్టగా పారిపోయింది. ఈ దారుణ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. అయితే అసలు ఆ ఆవు ఎందుకు అలా చేసిందనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన విషయంలో ఆవు చిన్నారిపై ఎందుకు దాడి చేసిందని అనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.