NRML: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవ్వనుండగా విద్యార్థులు వారి వారి పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని పలువురు ఆల్ ది బెస్ట్ చెప్పారు.