కోనసీమ: అమలాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని MLA అయితాబత్తుల ఆనందరావు అన్నారు. తాండవపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రక్షిత మంచినీటి ట్యాంకును, సీసీ రోడ్డు, కల్వర్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు.