»Ntr As Aquaman Mass Fight Sequence With Shark In Koratala Shiva Devara
Devara: ఎన్టీఆర్ తో కొరటాల మరో ప్రయోగం.. ఇది కూడా షెడ్డుకేనా.?
ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో ఓ భారీ మాస్ ఫైట్ ఉండబోతుందని, అది సముద్రంలో ఓ షార్క్‌తో ఉంటుందని తెలుస్తుంది.
Devara: ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్ (JR NTR), ఆచార్య వంటి డిజాస్టర్ తరువాత ఈ సారి హిట్ కొట్టాలన్న కసితో కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో వస్తున్న పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ దేవర. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor), స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రకటన చేసినప్పటి నుంచి నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా తీస్తాడని అప్పట్లో తెగ చర్చలు జరిగాయి. ఇక కొరటాల శివ ప్రస్థావన తెరమీదకు వచ్చినప్పుడు అభిమానులు మొదట కలవర పడ్డారు. ఇంతకు ముందు జనతా గ్యారెజ్ లాంటి సినిమా హిట్ అయినా.. రీసెంట్ ఫ్లాప్ ఆచార్య దృష్ట్యా ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఎన్టీఆర్ కూడా చాలా మార్పులు చేర్పులు తరువాతే ఈ కథను ఓకే చేసినట్లు తెలుస్తోంది. కోస్టల్ ఏరియా బ్యాగ్‌డ్రాఫ్‌లో కథ సాగుతుందని, క్రూరమైన జంతువుల్లాంటి విలన్లను హీరో టైగర్‌లా వేటాడుతాడని ఇది వరకే డైరెక్టర్ చెప్పడంతో సినిమాపై అందిరిలో అంచనాలు పెరిగాయి. తాజగా దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
దేవర సినిమాలో ఎన్టీఆర్ కి షార్క్ (shark) తో సముద్రంలో ఓ మాస్ ఫైట్ ఉండబోతుందని ప్రచారం సాగుతోంది. ఇది వరకే రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తిమింగలంతో ఫైట్ చేసినట్టు ఎన్టీఆర్ కూడా సముద్రంలో ఓ ఫైట్ చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ ఆక్వామ్యాన్ గా కనపడతాడేమో అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫైట్ సీక్వెన్స్‌లో ఎక్కువ గ్రాఫిక్స్ ఉంటాయని, అందుకే ఎన్టీఆర్ గ్రాఫిక్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇటీవల చిత్ర యూనిట్‌కి చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గ్రాఫిక్స్ విషయంలో శివ కొరటాల కాస్త వీక్ అని నెట్టింట్లో టాక్. గతంలో ఆచార్య సినిమాలో పూర్ వీఎఫ్ఎక్స్తో అభాసుపాలు అయ్యారు. మళ్లీ ఇదే రిపీట్ అయితదని అభిమానులు భయపడుతున్నారు. ఒక రకంగా రాజమౌళి సెంటిమెంట్ ప్రకారం చూస్తే త్రిబుల్ ఆర్ మూవీ తరువాత రామ్ చరణ్‌కు ఆచార్యతో ప్లాఫ్ ఇచ్చిన కొరటాల ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా ప్లాఫ్ ఇస్తారా అని డౌట్ కూడా ఉంది. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక నందమూరి అభిమానులు సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. 2024 ఎప్రిల్ 5న మూవీ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.