KMR: తెలంగాణ లెక్చరర్ల ఫోరం TLF ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా TLF జిల్లా అధ్యక్షుడు డా.బాలు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్లో ఉండడం వలన వివిధ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు వేతనాలు పొందలేకపోతున్నారు.