CTR: పుంగనూరు పట్టణంలోని కృష్ణదేవరాయల సర్కిల్, ఉయ్యాలవాడ సర్కిల్, కనుములో గంగమ్మ గుడి సర్కిల్ వద్ద వాహనాల వేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మేరకు సీఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ప్రమాదాల నియంత్రణకు పోలీస్ శాఖ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయడంతో వాహనదారులు, ప్రజలు పోలీస్ శాఖ వారికి కృతజ్ఞతలు తెలిపారు.