MDK: చేగుంట మండలం వడియారం 11, 12 వార్డుల్లో అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ పనులకు సర్పంచ్ సాయికుమార్ గౌడ్ పాలకవర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. మురుగు నీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, సభ్యులు అనిల్ యాదవ్, శ్రవణ్, జనార్ధన్ గౌడ్, సభా అంజుమ్, స్వప్నా పాల్గొన్నారు.