AP: అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు కఠోర దీక్ష చేశారని ఆత్మార్పణతో రాష్ట్రాన్ని సాధించారని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఆయన ఎన్నో సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో ఆయన పనిచేశారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగు భారీ విగ్రహాన్ని నిర్మించాం. ఆయన చేసిన త్యాగాన్ని తెలుగు జాతి గుర్తుపెట్టుకోవాలి’ అని పేర్కొన్నారు.