»2nd Class Child Died Due To Road Potholes In Hyderabad Bachupally
Hyderabad: రోడ్ల గుంతల కారణంగా రెండోతరగతి చిన్నారి మృతి
హైదరాబాద్ రోడ్లు మరో చిన్నారిని(child) బలి తీసుకున్నాయి. ఇప్పటికే ఇక్కడి రోడ్ల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతుండగా..తాజాగా హైదరాబాద్(Hyderabad) బాచుపల్లిలో మరో ఘోరం చోటుచేసుకుంది. రోడ్ల గుంతల కారణంగా ఓ తండ్రి స్కూటిపై వెళ్తున్న చిన్నారి కింద పడి మృత్యువాత చెందింది. ఆ వివరాలెంటో ఇఫ్పుడు చుద్దాం.
2nd class child died due to road potholes in Hyderabad bachupally
హైదరాబాద్(hyderabad) బాచుపల్లి(bachupally)లో బుధవారం(ఆగస్టు 2న) ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్ల గుంతల కారణంగా తండ్రితో కలిసి మోటార్‌సైకిల్‌పై స్కూలుకు వెళ్తున్న రెండో తరగతి విద్యార్థిని మరణించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భాగ్యనగరంలో అనేక చోట్ల గుంతలు ప్రమాదకరంగా ఏర్పడ్డాయి. ఆ క్రమంలో వెనుక నుంచి వచ్చిన వాహనం హారన్ కొట్టగా స్కూటిపై వెళ్తున్న ఓ తండ్రి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ బురదమయమైన రహదారి గుండా తండ్రి జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ రెడ్డీస్ ల్యాబ్ సమీపంలో వారి బైక్ ఓ గుంత దగ్గర స్కీడ్ అయింది. దీంతో ఆ బైక్ మధ్యలో ఉన్న చిన్నారి రోడ్డుకు కుడివైపుకు పడిపోయింది. దీంతో అదే క్రమంలో అటుగా వచ్చిన స్కూల్ వ్యాన్ ఆ చిన్నారి పైనుంచి దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో వారి కుటుంబంలోని సభ్యులు బోరున విలపిస్తున్నారు. రోడ్ల మరమ్మతు నిర్లక్ష్యం వల్లనే తమ చిన్నారి(child) మృత్యువాత చెందిందని, దీనికి మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు.
అయితే ఇప్పటికే హైదరాబాద్ రోడ్ల కారణంగా అనేక ప్రమాదాలు(accidents) చోటుచేసుకున్నాయి. కానీ రోడ్ల నిర్వహణ మాత్రం అలాగే ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు అనేక చోట్ల పాడైన రోడ్లను మరమత్తు చేయాలని కోరుతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ రోడ్లు చెరువుల మాదిరిగా మారుతున్నా కూడా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద నగరంలో చిన్న చిన్న గుంతలను కూడా త్వరగా మరమ్మతులు చేయాలేరా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కంకర తేలిపోయిన రోడ్లపై ప్రతి రోజు ప్రయాణించడానికి కూడా దారుణంగా ఉందని మరికొంత మంది అంటున్నారు.