MDK: మెదక్ ఎంపీ రఘునందన్ రావు మంగళవారం ఢిల్లీలో ఈఎస్ఐసీ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్ను కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.పటాన్చెరు, వరంగల్ ప్రాంతాల్లోని కార్మికులకు,ఉద్యోగులకు మెరుగైన సేవలందించేందుకు ఈ రెండు చోట్ల సబ్ రీజినల్ కార్యాలయాలను మంజూరు చేయాలని ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యాలయాల ఏర్పాటుతో స్థానిక ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.