NLG: చండూరులో సీఐటీయూ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కార్మికుల సమస్యలపై హైదరాబాద్లో నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు వారి ఇళ్ల వద్దే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్మికుల హక్కుల కోసం చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం తగదని నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.