AP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణాధికారిగా వ్యవహరిస్తున్న SDPO మనీశ్ పాటిల్ దేవరాజ్ కార్యాలయంలో ఆమెను విచారిస్తున్నారు. ఈ కేసులో అనంతబాబుతో పాటు లక్ష్మీదుర్గ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు ఇటీవల గుర్తించారు. ఆమెను ఏ2గా చేర్చి రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ వేశారు.