సత్యసాయి: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను కదిరిలో ఘనంగా నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద ఆయన విగ్రహానికి MLA కందికుంట వెంకట ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. అమరావతిలో 58 అడుగుల ‘స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్’ విగ్రహం ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని ఆయన కొనియాడారు.